19, జులై 2009, ఆదివారం

సుబ్బారావు వొకసారి వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు - వాళ్లు స్వీట్లు పెట్టారు .తింటున్నాడు ఇంతలొ అక్కడికి వాళ్ల ఫ్రెండ్ వాళ్ల చిన్నబాబు వచ్చి సుబ్బారావు వంక తదేకంగా చూస్తున్నాడు
సుబ్బారావు : ఏంటి బాబూ ఇంద కొద్దిగా ఈ స్వీట్ తీసుకో -ఆఫర్ చేసాడు
బాబు : వద్దు అంకుల్
సుబ్బారావు : ఎం ఎందుకు తీసుకోవ్ ? స్వీటంటే ఇష్టమున్దడా ?
బాబు : కాదు అంకుల్ నా కిష్టమే కాకబొతే అది ఆల్రెడీ మా పక్కింటి వాళ్ల కుక్క నాకింది -వివరించాడు బాబు.
నిజమైన సాక్షి !


జడ్జి : (బోనులో వున్న సాక్షితో) నువ్వా హత్య జరుగుతూ వుండగా నీ కళ్ళ తో చూసావా ?
సాక్షి : అవును సార్ చూసాను !
జడ్జి : మరెందుకు ఆ హత్యను ఆపటానికి ప్రయత్నించలేదు?
సాక్షి : ఆ హత్య చేయబడుతున్న వ్యక్తికి నే ను వొక లక్ష రూపాయలు బాకీ వున్ననుసార్ అసలు నిజం చెప్పాడు సాక్షి!